ఏప్రిల్ చివరలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పబ్లిక్ పరీక్షలు

ఏప్రిల్ చివరలో ఇంటర్ ఫలితాలు ముగిసిన పబ్లిక్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు:  ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో ఇంటర్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్ మూడోవారం లేదా నాలుగోవారంలో ఫలితాలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు అటెండ్ కావాల్సి ఉండగా, 98 శాతం మంది హాజరైనట్లు అధికారులు చెప్పారు. మరోపక్క ఈనెల 10 నుంచే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది.