హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈనెల 5 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీచేశారు.
ప్రైవేటు కాలేజీల్లో రూ.500 ఫైన్‌తో ఈనెల 6 నుంచి 16 వరకూ చేరొచ్చని స్పష్టం చేశారు. సర్కారు కాలేజీలతో పాటు సర్కారు సెక్టార్ కాలేజీలైనా గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఫైన్ ఉండదని తెలిపారు.