జూన్ 3న టీఎస్ లాసెట్.. 50వేల మంది అభ్యర్థులు

జూన్ 3న టీఎస్ లాసెట్.. 50వేల మంది అభ్యర్థులు

హైదరాబాద్,వెలుగు : ఎల్ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న టీఎస్​ లాసెట్, పీజీ ఎల్​సెట్ ఎగ్జామ్​ను జూన్ 3న నిర్వహించనున్నామని లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

మూడేండ్ల ఎల్ఎల్ బీ కోర్సులో సీట్ల కోసం 36,079 మంది, ఐదేండ్ల ఎల్​ఎల్​బీ కోర్సు కోసం 10,197 మంది, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సు కోసం 4,408 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ పరీక్షల కోసం 50,684 మంది దరఖాస్తు చేసుకోగా 68 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.