రైతులను ఆగం జెయ్యనీకే..దిక్కుమాలిన దందాలు

మంచిర్యాల జిల్లా తాండూర్ లో పోలీసులు 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్​చేశారు. తాండూరు నుంచి బీటీ -3 నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై లచ్చన్న, బోయపల్లి బోర్డు వద్ద మంచిర్యాల వైపు వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఓ కారు, బొలెరో వాహనంలో రూ. 10 లక్షల విలువైన 5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. పోలీసులు వాటిని సీజ్​ చేసి.. నిందితులు శ్రీరాముల నవీన్, ఒడ్నాల రాకేశ్, మోర్ల వెంకటస్వామిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని అరెస్ట్​చేసి విచారిస్తున్నారు.