
- మే 13 ప్రవేశపరీక్ష..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పాలిసెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం సాయంత్రం నాటికి 1.04 లక్షల మంది అప్లై చేశారు. గతేడాది 94వేల అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఈ ఏడాది సుమారు పదివేలకు పైగా దరఖాస్తులు పెరిగాయి. అయితే, ఈ నెల19తోనే పాలిసెట్ కు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, సోమవారం ఫైన్‌తో గడువు ముగిసింది. కాగా, మే 13న పాలిసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.