గొర్రెల కోసం వెళ్లి ఆరు రోజులుగా అనంతపురంలో అవస్థలు

గొర్రెల కోసం ఏపీకి వెళ్లిన రాష్ట్ర గొల్ల కురుమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ గొల్ల కురుమలు గొర్రెల కోసం ఏపీ వెళ్లారు.  గొర్రెల కోసం 6 రోజులుగా అనంతపురంలోనే తిరుగుతున్నారు వీణవంక మండలానికి చెందిన గొల్ల కురుమలు. 21 గొర్రెల యూనిట్ కి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 75 వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే  గొర్రెల యజమానులకు మాత్రం లక్షా 25 వేలు మాత్రమే ఇస్తుండడంతో చిన్న గొర్రె పిల్లలు,  బక్క గొర్రెలను అంటగడుతున్నారని గొల్ల కురుమలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.