
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ బోర్డ్ ఆఫీసులో ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్ తో పాటు సెకండియర్ రిజల్ట్ ను ప్రకటించారు. రివాల్యుయేషన్,రీ కౌంటింగ్ కు వారం రోజులు గడువు ఇచ్చారు అధికారులు.ఈ సారి కూడా ఉత్తీర్ణతలో బాలికలే పై చేయి సాధించారు.రాష్ట్రంలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ పరీక్షలకు 9.96 లక్షల మంది అటెండ్ అయ్యారు.
- ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 71.37 శాతం పాస్ అయ్యారు
- ఇంటర్ సెకండియర్ మొత్తం 66.89 శాతం పర్సంటేజ్
- ఇంటర్ ఫస్టియర్ లో 57.83 శాతం బాలురు ఉత్తీర్ణత
- ఇంటర్ ఫస్టియర్ లో 73 శాతం అమ్మాయిలు పాస్
- ఇంటర్ సెకండియర్ లో మొత్తం 77.73 శాతం అమ్మాయిలు పాస్