పేపర్ 1 ఈజీ.. పేపర్ 2 టఫ్ .. టెట్​కు భారీగాహాజరైన అభ్యర్థులు

టీఎస్ టెట్ చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పేపర్1 ఈజీగా రాగా, పేపర్ 2 మాత్రం టఫ్ గా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. ఉదయం 1,139 సెంటర్లలో పేపర్ 1 పరీక్ష నిర్వహించారు. దీనికి 2,69,557 మంది అభ్యర్థులకు గానూ 2,26,744 (84.12%) మంది అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం 913 సెంటర్లలో పేపర్ 2 ఎగ్జామ్ జరగ్గా.. 2,08,498 మందికి గానూ 1,89,963 (91.11%) మంది హాజరయ్యారు. టైమ్ దాటిన తర్వాత ఎవ్వరినీ అనుమతించలేదు. పేపర్ 1 గతంతో పోలిస్తే క్వశ్చన్లు ఈజీగానే వచ్చాయని అభ్యర్థులు చెప్తున్నారు. పేపర్ 2 మాత్రం గతం కంటే కఠినంగా వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ టఫ్ గా వచ్చిందంటున్నారు. రిజల్ట్స్ ఈ నెల 27న రిలీజ్ చేయనున్నారు.

సిరిసిల్లలో పేపర్ తారుమారు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెట్ 2 పేపర్‌‌‌‌లో సెట్ తారుమారైంది. సెంటర్లలో సెకండ్ సెట్​కు బదులు ఫస్ట్ సెట్​ను స్టూడెంట్లకు ఇచ్చారు. అప్పటికే పరీక్ష మొదలుపెట్టిన అభ్యర్థులు.. ఓఎంఆర్ షీట్లలో ఆన్సర్స్ రాశారు. తప్పు గుర్తించిన అధికారులు వెంటనే, స్టూడెంట్ల నుంచి ఆ సెట్ పేపర్లను తీసుకొని, మళ్లీ వేరే సెట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అయితే, అప్పటికే ఓఎంఆర్ ​షీట్‌‌లో చేసిన బబ్లింగ్‌‌లకు వైట్‌‌నర్​ రాయాలని సూచించారని అభ్యర్థులు వాపోయారు. ప్రశ్నాపత్రం సెట్​మారడంతో టైం అరగంట పొడిగించినట్లు తెలిపారు. వైట్‌‌నర్ వాడిన ఓఎంఆర్​ షీట్‌‌ వ్యాలిడ్ చేయరని, తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో వైట్‌‌నర్ వాడిన ఓఎంఆర్​మాన్యువల్‌‌గా చెక్ చేసి ఆన్ లైన్ లో పెడతామని, అభ్యర్థులు టెన్షన్ పడొద్దని డీఈవో రమేశ్ సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ కేఎన్ఆర్ జూనియర్ కాలేజ్ వద్ద టెట్ పరీక్షకు ఓ అభ్యర్థి 3 నిముషాలు లేట్‌గా రావడంతో అనుమతించలేదు. హైదరాబాద్​లోని పలు సెంటర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ALSO READ: తెలంగాణ సాయుధ పోరాట విజయం

ఒకే అభ్యర్థి.. పది మంది సిబ్బంది 

టెట్​లో ఒక్క అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్​ను ఏర్పాటు చేసి 10 మంది సిబ్బంది విధులు నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. తొర్రూరులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్​లో ఏర్పాటు చేసిన సెంటర్​లో ఉదయం ఐదుగురు అభ్యర్థులకు గానూ నలుగురు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్ 2కు ఒక్క అభ్యర్థి కోసం సీఎస్​, డీవో, రూట్​​ ఆఫీసర్​, ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు ఓఎస్​లు, అంగన్​వాడీ టీచర్, ఏఎన్ఎం, పోలీస్​ సిబ్బంది విధులు నిర్వహించారు. 

నల్గొండ జిల్లాలో మాల్ ప్రాక్టీస్ ఘటన చోటుచేసుకుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తించే ఎండీ వరీస్​ ముజ్నీ చిస్తీకి మిర్యాలగూడలోని కృష్ణవేణి హైస్కూల్​లో ఇన్విజిలేషన్ డ్యూటీ పడింది. ఈ సెంటర్​లోని రూమ్​నంబర్ 6 లో పరీక్ష రాస్తున్న తన మరదలుకు ఆమె క్వశ్చన్​పేపర్ కోడ్ ప్రకారం జవాబులు రాసిన స్లిప్​ను చిటీ ఇచ్చాడు. స్లిప్పులతో మాల్ ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని గుర్తించిన స్టూడెంట్స్ ఎగ్జామ్​ డ్యూటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఆఫీసర్లు సదరు అభ్యర్ధిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేశారు. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జేపీఎస్​ను సస్పెండ్ చేశారు.
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎగ్జామ్​సెంటర్లు ఎక్కడో తెలియక ఏడుగురు అభ్యర్థులు టెట్​ఎగ్జామ్ ​రాయలేకపోయారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి బీఈడీ కాలేజీలో పేపర్​2  ఎగ్జామ్​లో సోషల్ సబ్జెక్టుకు బదులు మ్యాథ్స్ పేపర్ ఇచ్చారు. మరో అభ్యర్థికి సంస్కృతం బదులు తెలుగు సబ్జెక్టు ఇచ్చారు.