హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఎగ్జామ్స్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. 10 రోజుల్లో 20 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్స్ఉంటాయన్నారు. సమాచారం కోసం 70329 01383, 90007 56178, 70750 88812, 70750 28881, 70750 28882, 70750 28885 నంబర్లకు కాల్ చేయాలని డైరెక్టర్ నర్సింహారెడ్డి కోరారు.