తెలంగాణలో జూన్ 2న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ టెట్ 2024) పరీక్షలు ముగిశాయి. మే 20వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు 10 రోజుల పాటు జరిగాయి. పేపర్-1కి 86.03 శాతం మంది.. పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. జూన్ 3 నుంచి 5వరకు అధికారిక వెబ్ సైట్ లో ప్రాథమిక కీ ఉంటుందని సోమవారం విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెబ్సైట్ లో తెలియజేయాలని టెట్ కన్వీనర్ సూచించారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. పేపర్-1కి 99,958 మంది.. పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.