రెజ్లర్లకు న్యాయం చేయాలి..ఎం రాజశేఖర్ రెడ్డి

నల్గొండ అర్భన్, వెలుగు :  భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషన్ పై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్​ రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రెజ్లింగ్ క్రీడాకారులకు మద్దతుగా ఆదివారం పట్టణంలో 2కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళ రెజ్లర్లపై  లైంగిక దాడికి యత్నించినట్టు ఫిర్యాదు అందినా  చర్యలు తీసుకోకపోవడం భారత మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. 

ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్పందించి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షురాలు బి. అరుణ, కోశాధికారి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, నరసింహ, వెంకన్న, జిల్లా నాయకులు శ్యామ్, నరసింహ, పి.సైదులు పాల్గొన్నారు.