హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్లపై శుక్రవారం టీసాట్ నెట్వర్క్ చానెళ్లలో ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని టీసాట్సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు వివిధ కోర్సులకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెంట్రల్యూనివర్సిటీల్లో ఉన్న కోర్సులు, విభాగాలపై లైవ్ కార్యక్రమంలో వివరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలకు సంబంధించిన ఫ్యాకల్టీ పాల్గొంటారని ఆయన వివరించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిపుణ చానెల్లో వీడియోలు ప్రసారమవుతాయని పేర్కొన్నారు.