
- అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా నెలపాటు క్లాసులు: టీసాట్
హైదరాబాద్, వెలుగు: వచ్చేనెలలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్మేనేజ్మెంట్అడ్మిషన్టెస్ట్(జీమ్యాట్)పై శనివారం నుంచి స్పెషల్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తామని టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. నెల పాటు అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా ప్రోగ్రామ్స్‌ను నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు నిపుణ చానెల్లో, సాయంత్రం 6 నుంచి 6.30 వరకు విద్య చానెల్లో క్లాసులను ప్రసారం చేస్తామన్నారు.
క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, డేటా ఇన్సైట్స్, ఆల్జిబ్రా అర్థమెటిక్,రీడింగ్ కాంప్రహెన్షన్-, క్రిటికల్ రీజనింగ్, డేటా సఫీషియన్సీ, మల్టీ సోర్స్ రీజనింగ్ క్లాసులు ఉంటాయని చెప్పారు. బిజినెస్ స్కూళ్లలో చదివి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాల్లో ఉద్యోగం పొందాలనుకునేవారు ఈ చాన్స్ వినియోగించుకోవాలని వేణుగోపాల్ రెడ్డి సూచించారు. వరల్డ్ఎర్త్ డే సందర్భంగా.. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పీసీబీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, సామాజికవేత్తలు ఎర్త్‌డే ప్రాధాన్యాన్ని వివరిస్తారని వేణుగోపాల్ పేర్కొన్నారు.