
తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ ఎగ్జామినేషన్-–2024కు ఉచిత కోచింగ్ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడదు. 31 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులకు 50 సీట్లను కేటాయించారు.
కోచింగ్: జులై 31 నుంచి ఏప్రిల్ 30, 2024 వరకు ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్, ఓయూ క్యాంపస్, తార్నాక, హైదరాబాద్లో ఇస్తారు.
సెలెక్షన్: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జులై 16న నిర్వహిస్తారు. వివరాలకు www.studycircle.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.