హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం మారడంతో తాను టెస్కాబ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొండూరి రవీందర్ తెలిపారు. ప్రభుత్వం మారడంతో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టార ని.. కానీ, అంతకన్నా ముందే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం టెస్కాబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను చైర్మన్గా ఉన్న తొమ్మిదేండ్లలో సహకార బ్యాంకులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. సమావేశంలోనే టెస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.