తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం

టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ శాఖల పేర్లను మారుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ ను.. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TGCHE) గా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇప్పటికే  TSPSC నిTGPSC గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.  దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారింది. ఇక, టీఎస్ఆర్టీసీని.. టీజీఎస్ఆర్టీసీగా మర్చారు. ఇప్పటికే రాష్ట్రంలో వాహనాదారులు ఇకనుంచి టీజీగా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం జీవో జారి చేసింది.