వెబ్‌సైట్‌లో సీపీజెట్ హాల్ టికెట్లు విడుదల

వెబ్‌సైట్‌లో  సీపీజెట్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TSCPGET) -2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జులై 6 నుంచి 9 వరకు జరిగే పరీక్షల హాల్‌టికెట్లను మాత్రమే అధికారులు విడుదల చేశారు. మిగతా పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను తర్వాత విడుదల చేయనున్నారు. 

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, పరీక్ష పేపరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి 15 మధ్య సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ 3 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫస్ట్ సెషన్‌లో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2.230 గంటల వరకు రెండో సెషన్‌లో, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.