నల్గొండ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సాయిరామ్ ఫార్మా అండ్ సర్జికల్స్ లో మినోక్సిటాప్ 10% అనే డ్రగ్ ను సీజ్ చేశారు. ఈ మెడిసిన్ వాడితే హెయిర్ గ్రోత్ అవుతుందంటూ షాపు యజమానులు వీటిని సేల్స్ చేస్తున్నారు. కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్న ఈ మెడిసిన్ అధికారులు సీజ్ చేశారు.
ఈ మెడిసిన్ వాడితే వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఉపయోగపడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ మెడిసిన్ అమ్ముతున్నారు నిర్వహకులు. హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన మినాక్సీటాప్ 10% గా అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మినాక్సీటాప్ 10% నిల్వలను డిసిఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.