న్యూఢిల్లీ: టాటా స్టీల్ తన సింగపూర్ బేస్డ్ సబ్సిడరీ టీ స్టీల్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ (టీఎస్‌హెచ్‌పీ) లో 875 మిలియన్ డాలర్లు (రూ.7,321.41 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. బదులుగా 557 కోట్ల ఈక్విటీ షేర్లను దక్కించుకుంది.
టీఎస్‌హెచ్‌పీలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఏడాది మే నెలలో టాటా స్టీల్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ అక్విజేషన్ తర్వాత టాటా స్టీల్‌కు పూర్తి స్థాయి సబ్సిడరీగా టీఎస్‌హెచ్‌పీ మారుతుంది.