మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల ఐబీ ఆవరణలోని ఎంసీహెచ్ నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి టీఎస్ఎంఐసీ ఇంజనీర్లు సోమవారం పరిశీలించారు. ఎంసీహెచ్ నిర్మాణం కోసం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పగించడం తెలిసిందే. ఐబీలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు గెస్ట్‌హౌస్, ఆర్అండ్బీ ఆఫీసులు ఉన్న బిల్డింగులను తొలగించి అక్కడ ఎంసీహెచ్‌ను నిర్మించనున్నారు.
స్థలాన్ని స్వాధీనం చేసుకొని త్వరగా పనులు ప్రారంభించాలని సీనియర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కోరారు. గత ప్రభుత్వం అనాలోచితంగా గోదావరికి దగ్గరలో ఎంసీహెచ్‌ను నిర్మించింది. గత రెండేండ్లుగా గోదావరి వరదల్లో ఎంసీహెచ్ మునిగింది. ఏటా వానాకాలంలో ముంపు ముప్పు పొంచివుండడంతో ఎంసీహెచ్‌ను ఐబీలో నిర్మించాలని ప్రేమ్‌సాగర్‌రావు ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది.