
- టీఎస్పీడీసీఎల్సీ ఎండీ ముషారఫ్ ఫరూఖీ
హైదారాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ జోన్ పరిధిలోని హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్ల పరిధిలో చేపట్టిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులను టీఎస్పీడీసీఎల్సీఎండీ ముషారఫ్ ఫరూఖీ గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్జోన్పరిధిలో మెరుగైన విద్యుత్ సేవలు అందించడానికి పని చేస్తున్నామన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా ఇప్పుడున్న సబ్స్టేషన్లలో అదనంగా 62 పవర్ట్రాన్స్ ఫార్మర్లు, 1081 పంపిణీ ట్రాన్స్ ఫార్మర్లు, 11 కేవీ ఫీడర్లు 243 , 33 కేవీ ఫీడర్లు 37 ఏర్పాటు, 15 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా హబ్సిగూడ పరిధిలోని సాయి నగర్ లో ఏర్పాటు చేసిన12.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్లను, వీరారెడ్డి కాలనీ, ఎస్బీఆర్ కాలనీలో ఫీడర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిని సీఎండీ..అక్కడికి వచ్చిన వినియోగదారులతో ప్రారంభింపజేశారు. భౌరంపేట్ సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన 33 కేవీ ప్రగతి నగర్ ఫీడర్, శంషిగూడ, ఉస్మాన్ సాగర్ సబ్ స్టేషన్ లలో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఆవిష్కరించారు. కమర్షియల్ డైరెక్టర్ సాయి బాబా, మేడ్చల్ జోన్ చీఫ్ ఇంజినీర్ కామేశ్, సూపరింటెండెంట్ఇంజినీర్లు పి బ్రహ్మం, రవి కుమార్, శ్రీనాథ్ పాల్గొన్నారు.