పేపర్ల లీకేజీతో పాటు వరుస వివాదాలతో TSPSC చైర్మన్ జనార్దన్‌రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట. బోర్డులో సిబ్బంది కొరత, బయటి నుంచి విమర్శలతో ఇబ్బంది పడుతున్నారట. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై ఫీలవుతున్నారట. పేపర్ల లీకేజీ ఇష్యూ కొంతవరకు సద్దుమణిగినా.. లేటేస్ట్ గా గ్రూప్ 2 వివాదంతో మరోసారి TSPSC తీరు చర్చనీయాంశంగా మారింది. వరుస వివాదాలతో తనకెందుకీ తిప్పలనీ సన్నిహితుల దగ్గర అవేదన వ్యక్తం చేస్తున్నారట చైర్మన్ జనార్దన్ రెడ్డి.
చైర్మన్ పదవికి రిజైన్ చేయాలనే అలోచనలో జనార్ధన్ రెడ్డి ఉన్నట్టుగా చర్చ బాగానే జరగుతోందట. ఓవైపు వివాదాలు, ఇంకోవైపు బోర్డులో తగినంత సిబ్బంది లేకపోవడం, మరోవైపు ఉన్నవాళ్లతోనే నెట్టుకొస్తూ చైర్మన్ ఒత్తిడికి గురవుతున్నారని చెప్పున్నారట అయన సన్నిహితులు.
పేపర్ల లీక్ తరువాత ఉద్యోగాల భర్తీ కోసం కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు ఆఫీసులోనే ఉంటున్నారట జనార్దన్ రెడ్డి. నియామకాల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయినా కొంతమంది ఉద్యోగుల తీరుతో ఇబ్బంది పడాల్సి వస్తోందని సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్షాలు కూడా తననే టార్గెట్ చేయడంపై ఆయన మరింత ఒత్తిడికి గురవుతున్నారట. పదవి నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందని సన్నిహితులతో చర్చించారట చైర్మన్. ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని సూచించారట. ఒక కీలక మంత్రి కూడా ఇదే సలహా చైర్మన్ కు ఇచ్చారట. అయినప్పటికీ చైర్మన్ పదవి వద్దనే ఆలోచనలోనే చైర్మన్ ఉన్నారట. ఇంటా బయట విమర్శలు వస్తుండటంతో రాజీనామే శరణ్యం అనుకుంటున్నారట చైర్మన్ జనార్దన్ రెడ్డి.