ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు... పోలీస్ శాఖ అధికారులతో TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. 33 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జనార్థన్ రెడ్డి తెలిపారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్‌కుమార్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్నారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలె క్టర్లను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌లను గు ర్తించి, పోలీసు శాఖ సమన్వయంతో తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని, జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు.
ఎగ్జామ్ సెంటర్ల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర సౌలత్లు ఉండేలా చూడాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా జరిగే ప్రిలిమినరీ టెస్ట్ కోసం హాల్ టికెట్లు https://www.tspsc.gov.in వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ ఫీచర్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.