Group 3 Exam: నవంబర్ 17, 18వ తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్..

  •  హాజరుకానున్న 5.36 లక్షల మంది అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  ఈ నెల17, 18 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించనుండగా.. 5,36,395 మంది అభ్యర్థులు అటెండ్ కానున్నారు.  వారికోసం 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిషన్ వెబ్ సైట్​నుంచి హాల్ టికెట్ల డౌన్​ లోడ్ ప్రక్రియ ప్రారంభమైందని కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.