TSPSC: జూన్ 11న జరిగిన గ్రూప్ 1 పరీక్ష రద్దు : హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యింది. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.  జూన్ 11 న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు..గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. 

జూన్ 11న మళ్లీ రెండోసారి గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహించారు. దీనికి 2 లక్షల 33 వేల 506 మంది అటెండ్ అయ్యారు. అయితే గ్రూప్‌ -1 పరీక్ష విషయంలో పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్  ను రద్దు చేయాలని పిటిషన్ లో స్పష్టం చేశారు.