గ్రూప్–1 నోటిఫికేషన్పై సుప్రీం కోర్టులో సర్కార్కు ఊరట

ఢిల్లీ: గ్రూప్–1 నోటిఫికేషన్పై సుప్రీం కోర్టులో సర్కార్కు ఊరట లభించింది. గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్లో తప్పులున్నాయంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం డిస్మిస్ చేసింది. 2024 నోటిఫికేషన్ చట్ట విరుద్దమంటూ కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.