గ్రూప్ 1 పరీక్ష రెండోసారి రద్దు కావడం ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత టీఎస్పీఎస్సీ సమర్థతను తెలుపుతున్నది. లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 పరీక్ష రాసి ఫలితాల కోసం వేచి చూస్తుంటే.. పరీక్ష రద్దయిందనే వార్తలు రావడం వారి మానసీక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. ఒకసారి తప్పు జరిగితే.. పొరపాటు అనుకోవచ్చు.
రెండోసారీ పరీక్ష సరిగా నిర్వహించకపోవడం, మళ్లీ తప్పులు జరగడం.. కోర్టు పరీక్షను రద్దు చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వంపై ఉద్యోగార్థులకు నమ్మకం పోయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఎన్నడూ లేదు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ప్రస్తుత కమిషనర్ సహా పూర్తి స్థాయి సభ్యులను తొలగించి, కొత్త బోర్డును నియమించాలి.