తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ కాసేపటి క్రితమే హైకోర్టు తీర్పు ఇచ్చింది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ - 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరోసారి గ్రూప్ 1 రద్దు కావడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. అసలు రద్దుకు గల కారణాలేంటో ఒకసారి చూద్దాం.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు గ్రూప్ 1ను రద్దు చేస్తున్నట్లు ఇవాళ తీర్పునిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ALSO READ : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..ఆందోళనలో 2 లక్షల 30 వేల మంది స్టూడెంట్స్
తెలంగాణలో 2023 జూన్ 11న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి 2,33,506 మంది అటెండ్ అయ్యారు.