తెలంగాణలో జూలై 1 న జరిగే గ్రూప్ 4 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్స్ కు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పేపర్ 1 జరుగుతుంది. ఎగ్జామ్ కు పావుగంట ముందే అంటే 9.45 గేట్లు క్లోజ్ చేస్తారు అధికారులు. 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. 2.15 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు.
దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ పీఎస్ సీ తెలిపింది. ఈ సారి ప్రతీ పరీక్షా కేంద్రంలో థంబ్ మిషన్స్ పెట్టారు. ఎగ్జామ్ సెంటర్ కు రెండు గంటల ముందే చేరుకొని..వేలిముద్రలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు ఎగ్జామ్ ముగిసిన తర్వాత థంబ్ తీసుకుంటారు.
అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సినవి.
- వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి లేదు
- చెప్పులు వేసుకోవాలి,ఎవరు షూస్ వేసుకోవద్దు.
- ఎగ్జామ్ లో అక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు, శాశ్వతంగా డీబార్