గ్రూప్ 4 ఫలితాలు విడుదల .. 8,084 మందితో సెలెక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్​ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ www.tspsc.gov.in లో పెట్టింది. కాగా, రాష్ట్రంలోని 8,180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1న టీజీ​పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 

వారందరికీ గతేడాది జులై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియంతా పూర్తికావడంతో గురువారం ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8,084 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్​లో పెట్టారు.