
హైదరాబాద్, వెలుగు: మహిళా, శిశు సంక్షేమ శాఖలో 23 అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల13 నుంచి అక్టోబర్ 10 వరకు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, సోషల్ వర్క్, హోమ్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.