హైదరాబాద్, వెలుగు: జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ సోమ వారం రిలీజ్ చేసింది. ఎక్స్ పర్ట్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ ‘కీ’ని ప్రకటి స్తున్నట్టు కమిషన్ తెలిపింది. కమిషన్ వెబ్ సైట్ లో కీ చూసుకోవాలని అభ్యర్థు లకు సూచించింది. రాష్ట్రంలో సర్కారు జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1,392 జేఎల్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
గతేడాది సెప్టెంబర్12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వారంలోనే ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి అభ్యంత రాలను స్వీకరించిన కమిషన్.. ఫైనల్ కీ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసింది. అభ్య ర్థుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత సోమవారం ఫైనల్ కీ ని టీఎస్పీఎస్సీ తన వెబ్ సైట్లో పెట్టింది.