
నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనుండగా ఇందులో జోనల్, మల్టీ జోనల్‌తో పాటు స్టేట్ క్యాడర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాతపరీక్ష ఆధారంగా గెజిటెడ్ కొలువులు సాధించేందుకు ఇదో మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్2 పరీక్ష ద్వారా మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ రద్దు చేయడంతో రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కొలువు సాధించవచ్చు.
సిలబస్‌లో కొత్త మార్పులు
గ్రూప్2లోని మొత్తం నాలుగు పేపర్లలో పేపర్2లో స్వల్ప మార్పులు జరిగితే, పేపర్3లో చాలా మార్పులు చేశారు. పేపర్1, 4 లో ఎలాంటి మార్పులు జరగలేదు.
పేపర్ 2, సెక్షన్–2 : ఈ విభాగంలో కొత్తగా భారత రాజ్యాంగం: సవరణ విధానాలు మరియు సవరణ చట్టాలు. ఎలక్టోరల్ మెకానిజం– ఎలక్టోరల్ చట్టాలు మరియు పార్టీ ఫిరాయింపు చట్టం. భారతదేశంలో న్యాయ వ్యవస్థ– న్యాయ సమీక్ష. ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రత్యేక ప్రోవిజన్లు, జాతీయ మహిళ, మైనారిటీ మరియు మానవ హక్కుల కమిషన్లు, జాతీయ సమగ్రత సమస్యలు మరియు సవాళ్లు, తిరుగుబాట్లు, అంతర్గత సెక్యూరిటీ, అంతర్రాష్ట్ర వివాదాలు.
పేపర్ 2, సెక్షన్–3: ఇందులో కొత్తగా భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం మరియు మహిళలు. సామాజిక సమస్యల్లో ట్రాన్స్జండర్ ప్రాబ్లమ్స్. సామాజిక ఉద్యమాలు అనే అంశంలో పౌర హక్కుల ఉద్యమాలు. తెలంగాణ సొసైటీ లో తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సాంస్కృతిక లక్షణాలు మరియు సమస్యలు, కష్టాల్లో శిల్పకారులు మరియు సేవా సంఘాలు అంశాన్ని చేర్చారు.
పేపర్ 3, సెక్షన్–1: ఈ విభాగంలో డెమోగ్రఫీ (జనాభా శాస్త్రం): భారతదేశ జనాభా లక్షణాలు– జనాభా పరిమాణం మరియు వృద్ధిరేటు–డెమోగ్రపిక్ డివిడెండ్–రంగాల వారీగా జనాభా – భారతదేశ జనాభా విధానాలు. జాతీయ ఆదాయం విభాగంలో జాతీయ ఆదాయ భాగాలు– ఆదాయంను లెక్కించే పద్ధతులు–భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు, తలసరి ఆదాయం.
ప్రాథమిక, ద్వితీయ రంగాలు : వ్యవసాయం మరియు సంబంధిత రంగాలు, జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం సహకారం, పంటల విధానం–వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదన–హరిత విప్లవం, నీటిపారుదల, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవసాయ సబ్సిడీలు, ఆహార భద్రత అంశాలు చేర్చారు.
పరిశ్రమలు, సేవా రంగం : భారతదేశంలో పరిశ్రమల వృద్ధి మరియు నిర్మాణం, జాతీయ ఆదాయానికి పరిశ్రమలు, సేవల రంగాల సహకారం, పారిశ్రామిక విధానాలు, భారీ తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రియల్ఫైనాన్స్, జాతీయ ఆదాయానికి సేవల రంగం కాంట్రిబ్యుషన్, సేవారంగం ప్రాముఖ్యత, సేవా రంగం ఉప రంగాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, భారతదేశ వాణిజ్యం టాపిక్స్.
ప్లానింగ్, నీతిఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్ : పంచవర్ష ప్రణాళికల వైఫల్యాలు, భారతదేశ బడ్జెట్, బడ్జెట్లో లోటు భావనలు, ఎఫ్ఆర్బీఎం, తాజా యూనియన్ బడ్జెట్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ వ్యయం, పబ్లిక్ అప్పులు, ఫైనాన్స్ కమిషన్లు భాగాలు చేర్చారు.
పేపర్ 3, సెక్షన్–2 : ఇందులో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధి: స్టేట్ ఫైనాన్స్ (థార్ కమిషన్)– 2014 నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్థి మరియు అభివృద్ధి రంగాల వారీగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం.
జనాభా మరియు మానవ వనరుల అభివృద్ధి : జనాభా పరిమాణం, వృద్ధి రేటు– తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క జనాభా లక్షణాలు, జనాభా యొక్క వయసు నిర్మాణం, జనాభా డివిడెండ్.
వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు : వ్యవసాయం ప్రాధాన్యత, వ్యవసాయ వృద్ధిరేటులోని ట్రెండ్స్ జీఎస్డీపీ/జీఎస్వీఏ కి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కాంట్రిబ్యూషన్, భూమి వినియోగం, భూ హోల్డింగ్ విధానం, పంటల విధానం, నీటిపారుదల సంబంధిత రంగాల వృద్ధి మరియు అభివృద్ధి వ్యవసాయ విధానాలు మరియు ప్రోగ్రామ్‌లు.
పరిశ్రమ మరియు సేవల రంగాలు : జీఎస్డీపీ/జీఎస్‌వీఏకి పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ పాలసీ–జీఎస్డీపీ కి సేవల రంగం కాంట్రిబ్యూషన్ సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు.
రాష్ట్ర ఫైనాన్స్‌లు, బడ్జెట్, పాలసీలు : రాష్ట్ర రెవెన్యూ, వ్యయం మరియు అప్పు– రాష్ట్ర బడ్జెట్లు– రాష్ట్రం యొక్క సంక్షేమ పాలసీలు.
పేపర్3, సెక్షన్–3: ఇందులో అభివృద్ధి మరియు అండర్ డెవెలప్మెంట్ లక్షణాలు, ఆర్థిక వృద్ధి కొలమానాలు మరియు మానవ అభివృద్ధి సూచికలు, నివేదికలు. సామాజిక మౌలిక సదుపాయాలు.
పేదరికం మరియు నిరుద్యోగిత : ఆదాయ అసమానతలు, నిరుద్యోగిత భావనలు, సంక్షేమ ప్రోగ్రామ్స్, ప్రాంతీయ అసమానతలు.
పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి : పర్యావరణ భావనలు–పర్యావరణ రక్షణ, కాలుష్యం రకాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ ప్రభావాలు, భారతదేశ పర్యావరణ పాలసీలు చేర్చారు.
నోటిఫికేషన్
అర్హతలు : పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ(మ్యాథ్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ లా), ఎంఏ(సోషల్ వర్క్/ సైకాలజీ/ క్రిమినాలజీ/ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్). డిప్లొమా (టెక్స్‌టైల్ టెక్నాలజీ/ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ). ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికేట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో నెగటివ్ మార్కులు లేవు.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం www.tspsc.gov.in వెబ్సైట్లో చూసుకోవాలి.
పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీస్ IAS స్టడీ సర్కిల్