త్వరలో గ్రూప్–4 సర్టిఫికెట్ వెరిఫికేషన్

త్వరలో గ్రూప్–4 సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • జనరల్ అభ్యర్థులకు 1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో లిస్ట్​
  • జాబితాను వెబ్​సైట్​లో పెడ్తామని టీఎస్​పీఎస్సీ ప్రకటన
  • సర్టిఫికెట్లు రెడీ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన

హైదరాబాద్, వెలుగు :  త్వరలోనే గ్రూప్– 4 రిక్రూట్​మెంట్​ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్​పీఎస్సీ రెడీ అవుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో జనరల్ ర్యాంకింగ్​ లిస్ట్​ (జీఆర్ఎల్) రిలీజ్ చేసిన కమిషన్.. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్టు ప్రకటించింది. జనరల్ అభ్యర్థులను1:3, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి, ఆ లిస్టును వెబ్ సైట్​లో పెడ్తామని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్​, బీసీలైతే కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, పీడబ్ల్యూడీ, స్టడీ/ రెసిడెన్స్ సర్టిఫికెట్ (ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా)తో పాటు ఇతర రిజర్వేషన్లు, క్వాలిఫికేషన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.  వెరిఫికేషన్​ సమయంలో సర్టిఫికెట్లు సమర్పించని వారికి మరో అవకాశం ఇవ్వబోమని తెలిపింది.  కాగా, రాష్ట్రంలో  8,180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్​లో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9,51,205 మంది అప్లై చేశారు. నిరుడు జులై 1న ఎగ్జామ్ జరగ్గా.. 7,61,198 మంది హాజరయ్యారు. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఫిబ్రవరి 9న జనరల్‌‌‌‌‌‌‌‌ ర్యాంకు మెరిట్‌‌‌‌‌‌‌‌ జాబితా (జీఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌)ను ప్రకటించింది. ఇందులో 7,26,837 మంది అభ్యర్థుల ర్యాంకులు పొందుపరిచిన టీఎస్​పీఎస్సీ.. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఇటీవల లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల పోలింగ్‌‌‌‌‌‌‌‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీపై కమిషన్​ దృష్టిపెట్టింది.