నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్‌సీ ఆడుకుంటోంది : భారత్ సురక్ష సమితి

జగిత్యాల టౌన్, వెలుగు:  టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపిస్తూ ఆదివారం జగిత్యాల తహసీల్  చౌరస్తాలో భారత్ సురక్ష సమితి లీడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డు నిర్లక్ష్యంతో ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. 

పేపర్ లీకులు, పరీక్షలు రద్దుతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్​1 రెండోసారి రద్దుపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్​రాజు, గంగాధర్, శ్రీనివాస్, దుబ్బారజం, లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.