టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీక్ కేసులో ఐదో రోజు నిందితుల విచారణ కొనసాగుతోంది. 9 మందినిందితులను సిట్ ఆఫీస్ లో ప్రశ్నిస్తున్నారు అధికారులు.
నాలుగు రోజుల పాటు విచారించిన సిట్ కీలక విషయాలు రాబట్టింది.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లల్లో ఆధారాలు సేకరించిన అధికారులు పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ లు ఎప్పటి నుంచో పేపర్లు లీక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి పెన్ డ్రైవ్ లో పేపర్లు ఉన్నట్లు గుర్తించారు. పెన్ డ్రైవ్ లకు పాస్ వర్డ్ లు పెట్టినట్లు అధికారులు చెప్పారు. గ్రూప్ 1 రాసినవారిలో కొందరు టీఎస్ పీఎస్ సీ ఉద్యోగులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తం 8 మంది ఎగ్జామ్ రాసినట్లు గుర్తించిన సిట్ ..ఈ 8 మందికి నోటీసులు ఇవ్వనుంది.