
- డిగ్రీ కాలేజీల్లో 544, ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 71 పోస్టులు
- మున్సిపల్ శాఖలో 78, ట్రాన్స్‌పోర్ట్‌లో 113 ఖాళీల భర్తీ
- జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు అప్లికేషన్లు
- మే లేదా జూన్‌లో ఎగ్జామ్ నిర్వహించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మరో 4 నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లోని 806 పోస్టులకు శనివారం నోటిఫికేషన్లు ఇచ్చింది. కాలేజియెట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు (డిగ్రీ లెక్చరర్లు), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 దాకా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21 నుంచి అప్లికేషన్లను తీసుకోనుంది. ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తులను స్వీకరించనుంది.
వీటన్నింటికి మే లేదా జూన్‌లో ఎగ్జామ్‌ను నిర్వహించే అవకాశమున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 78 పోస్టులకు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులను తీసుకోనుంది. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) పోస్టులను భర్తీ చేసేందుకు జనవరి 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను తీసుకోనుంది. ఫిబ్రవరి 1 దాకా దరఖాస్తులను స్వీకరించనుంది. ఎంవీఐ పోస్టులకుఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.