మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన ధాన్యం బస్తాలతో ఆగి ఉన్న ట్రాక్టర్లును ఓ బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. వెనుకనే వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బొలెరో వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ రాహుల్ శ్యాం సావ్య(20) మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read :- ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా.. పబ్ కు పిలిచి బకరాను చేసింది