బండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం : బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు

బండ్లగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం : బైక్స్ నుజ్జునుజ్జు, ప్రాణాలతో బయటపడిన విలేకరులు

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని షాదాన్ కాలేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుకు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాలను ఢీ కొటుకుంటూ దూసుకెళ్లింది. వాహనదారులు ఆర్టీసీ బస్సును చూసి పక్కకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విలేకరులు ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సు డీ కొట్టడంతో రెండు కార్లు, రెండు బైకులు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి. ఆర్టీసీ చక్రాల కింద విలేకరుల బైకులు నలిగిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులను గురైయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి యత్నించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.