అనంతగిరిలో ప్రమాదం.. పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

అనంతగిరిలో ప్రమాదం.. పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి దూసుకొళ్లడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. జనవరి 13వ తేదీ శనివారం హైదరాబాద్ నుండి తాండూర్ వైపుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన  పోలీసులు.. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిందని భావిస్తున్నట్లు తెలిపారు.