రోడ్డు ప్రమాదంలో కండక్టర్‌ మృతి.. అండగా నిలిచిన టీఎస్‌ఆర్‌టీసీ

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) అండ‌గా నిలిచింది. ఇంటి పెద్ద అకాల మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్‌టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

ఆప‌ద స‌మ‌యంలో సత్తయ్య తీసుకున్న యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు అతని కుటుంబానికి అండ‌గా నిలిచాయి. ఇటీవల టీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం ఉద్యోగులకు, సిబ్బందికి ఆర్థిక ప్ర‌యోజ‌నంతో కూడిన యూబీఐ సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాతా, కార్డుపై ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రూ.40ల‌క్ష‌లు(ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం), రూపే కార్డు కింద మ‌రో రూ.10 ల‌క్ష‌లు యూబీఐ బాధితుడి కుటుంబానికి అందజేసింది. అందుకు సంబంధించిన చెక్కులకు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌.. యూబీఐ అధికారులతో కలిసి స‌త్త‌య్య కుటుంబానికి అందజేశారు.

రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్… pic.twitter.com/kCyLmRXaKf

— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) June 13, 2023