శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ . వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్ నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించింది.
అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను #TSRTC నడుపుతోంది. #Hyderabad నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ… pic.twitter.com/OMd2euufJc
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 25, 2024