![పాటతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న ఆర్టీసీ డ్రైవర్](https://static.v6velugu.com/uploads/2021/11/tsrtc-md-vc-sajjanar-praises-on-driver-shantaiah_No6GIFsx4e.jpg)
టీఎస్ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యంతో పాటు సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. మామూలుగా అయితే బస్సులోని సీట్లు నిండేందుకు ప్రయాణికులు రావాలంటూ కండక్టర్లు, డ్రైవర్లు ఊర్ల పేర్లు చెబుతూ రైట్ ..రైట్ అంటుంటారు. మరికొంతమందైతే ప్రయాణికులు చేయి ఎత్తిన చోట బస్సు ఆపి ఎక్కించుకుంటారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డ్రైవర్ శాంతయ్య..మైకుతో పాటలు పాడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. జిల్లా పరిధిలోని నాయినిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ డ్రైవర్ అమ్మవారి పాటలు పాడుతూ సింగర్ అవతారమెత్తాడు. మైసమ్మ దేవతపై ఓ పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేద్దామంటూ ప్రయాణికులకు రిక్వెస్ట్ చేస్తూ మరో పాట పాడాడు డ్రైవర్ శాంతయ్య ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేయడంతో వైరల్ అయ్యింది.
Promoting #PublicTransport By Sri Shanthaiah Driver, #Nagarkurnool depot #TSRTC #Hyderabad #IchooseTSRTC @puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @VChelamela @SpNagarkurnool @TV9Telugu @sakshinews @V6News @way2_news @rpbreakingnews @AsianetNewsTL @ANI @PIBHyderabad @IPRTelangana pic.twitter.com/H6RO0NAmKy
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 15, 2021