తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ టూ విజయవాడ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు బస్సు టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ రిటర్న్ జర్నీకి కూడా వర్తిస్తుంది.
సాధారణంగా హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రైవేట్ బస్సుల ఛార్జీలు అధికంగా ఉంటాయి. వారి ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో, ముందస్తు రిజర్వేషన్ సౌకర్యంతో అన్ని సేవలపై బస్సు టిక్కెట్ ఛార్జీలపై తగ్గింపును అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఆఫర్ తో విజయవాడ రూట్‌లో ఒక్కో ప్రయాణికుడికి రూ.100 సేఫ్ అవుతోంది.
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62… pic.twitter.com/nvG8kzoaRH
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 27, 2024
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును TSRTC నడుపుతోంది. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించండి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.