సంక్రాంతి పండక్కి వారం రోజుల ముందు నుంచే కోడి పందాలకు ఏర్పాటు చేసుకుంటున్నారు పందెం రాయుళ్లు. ఈ పందెం పోటీల కోసం గత కొన్ని నెలలుగా కోడీ పుంజులను సిద్ధం చేస్తారు. పోటీల్లో గెలిపే లక్ష్యంగా పందెం రాయుళ్లు.. బలంగా ఉండేందుకు వాటికి మంచి ఆహారాన్ని పెట్టి పెంచుతారు. ఈ కోడి పందెం పోటీలు... తెలంగాణ కంటే.. ఆంధ్రాలోనే భారీ ఎత్తున నిర్వహిస్తారు.
ఈ పోటీల్లో పాల్గొనేందుకు కొందరు పెందెం రాయుళ్లు.. కోడి పుంజులను కొని పోటీకి సిద్ధం చేస్తారు. ఈ క్రమంలో కొందరు పందెం రాయుళ్లు... ఆర్టీసీ బస్సులో తమ పందెం కోడిని మర్చి పోయి దిగేశారు. దీంతో దాన్ని మేపలేక ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ ఘటనలో కరీంనగర్ లో చోటుచసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ఎవరైనా ప్రయాణికులు వస్తువులు మర్చిపోతే.. వాటిని భద్రపరిచి తిరిగి వారికి అందించడం చేస్తుంటారు. తినే వస్తువులు మర్చిపోతే... రెండు రోజులు చూసి అవి ఎవరో ఒకరికి ఇచ్చేస్తారు. అయితే, కరీంనగర్ ఆర్టీసీ బస్సులో పందెం కోడిని మర్చిపోయారు. దాని కోసం ఎవరైన వస్తారేమోనని కరీంనగర్ ఆర్టీసీ-2 డిపో ముందు కట్టేశారు అధికారులు. సంక్రాంతిలో పందెం కోసం కోడిని తీసుకువచ్చి బస్సులో మర్చిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే, రెండు రోజులైనా ఎవ్వరూ రాకపోవడంతో.. దాదాపు 6 కిలోల బరువున్న కోడికి.. రోజూ దాణ, నీరు పెట్టి పోషించలేక వీలైనంత త్వరగా దానిని వదిలించుకోవాలని చూస్తున్నారు ఆర్టీసీ ఆధికారులు.