బస్సులో మర్చిపోయిన పందెం కోడి ఆలనా పాలనా చేసుకోలేక దాన్ని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారు. మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియన వ్యక్తులు మరిచిపోయారు. కోడిని స్వాధీనం చేసుకున్న అధికారులు డిపోలో కట్టేసి.. దానిని కోసం ఎవరైనా వస్తారేమోనని చూశారు. అయితే, రోజులు గడుస్తున్నా.. ఎవ్వరూ రావడం లేదు.. దానికి మేత పెట్టలేక వదిలించుకోవాలని నిర్ణయించారు అధికారులు. ఈ క్రమంలో పందెం కోడిని వేలం వేయనున్నట్లు ప్రకటించారు.
జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ వేలం వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కోడిని మర్చిపోయిన వారు తిరిగి దాని కోసం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కరీంనగర్ డిపో-2 అధికారులు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని పందెం కోడిని సొంతం చేసుకోవాలన్నారు కోరారు.