నిజామాబాద్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెంక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు అధికారులు.
ఆర్టీసీ లీజు స్థలంలో ఉన్న షాపింగ్ మాల్ పెండింగ్ బకాయిలు గడువులోపు చెల్లించనందుకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీజ్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. షాపింగ్ మాల్ లో ఉన్న రెంటర్స్ తమ అనౌన్స్ మెంట్ ని గమనించాలని చెప్పారు