తల్లాడ, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా తల్లాడ మండలంలో 200 మంది దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సహకారంతో టీఎస్ఆర్టీసీ సత్తుపల్లి బుధవారం తల్లాడ రైతు వేదికలో బస్ పాస్ లను ఫ్రీగా రెన్యువల్ చేసి అందజేశారు. ఇందులో 50 శాతం ఆర్టీసీ రాయితీ ఇవ్వగా మిగతా 50 శాతం డబ్బులు లయన్స్ క్లబ్ చెల్లించింది.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డిపో విలేజ్ సబ్ ఆఫీసర్ ఆనందరావు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మునీర్ పాషాశాంసన్, క్లబ్ అధ్యక్షుడు బెల్లంకొండ ఆంజనేయులు, సీనియర్ లైయన్స్ సభ్యులు కర్నాటి లక్ష్మారెడ్డి, ధారా శ్రీనివాసరావు, డీసీలు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, శీలం వెంకటరెడ్డి, అనుమోలు సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.