హైదరాబాద్​ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

హైదరాబాద్​ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. వచ్చే నెల 3న గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడుపుతోంది. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్​లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరి, ఏపీ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానం తరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.

గిరి ప్రద ర్శన పూర్తయ్యాక జులై 3 మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్​కు వెళ్తుంది. తర్వాత హైదరాబాద్​కు మరుసటి రోజు జులై 4 ఉదయం 10 గంటలకు చేరుకుంటుందని ఆర్టీసీ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపింది. ధరను ఒక్కొక్కరికి రూ.2600గా సంస్థ నిర్ణ యించింది. టికెట్ రిజర్వేషన్ కోసం ఎం జీబీఎస్, జేబీఎస్, దిల్ షుఖ్ నగర్ బస్టాండ్లు, దగ్గర్లోని ఆర్టీసీ రిజర్వేషన్ కౌం టర్లను లేదా http://tsrtconline.in వెబ్ సైట్​ను సంప్రదించాలని పేర్కొంది.