ఐపీఎల్ -2024 లో భాగంగా 2024 ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్డేడియం ఇందుకు వేదిక కానుంది. సొంత గడ్డపై ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ చెన్నైతో జరిగే మ్యాచ్ లో కూడా ఆదే జోరు కనబరచాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు సూచించారు.
ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్ మార్చి 27న ముంబైతో జరగగా.. ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్, మే 8న లక్నో సూపర్ జెయింట్స్, మే 16న గుజరాత్ టైటాన్స్, మే 19న పంజాబ్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.
ALSO READ :- బిగ్ బ్రేకింగ్...బెంగళూరులో కలరా విజృంభిస్తోంది..50శాతం పెరిగిన కేసులు